తండ్రి అయిన రణదీప్ హుడా

  • పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య
  • రణదీప్ తండ్రి రణబీర్ పుట్టినరోజు కూడా ఈరోజే
  • ఇది తమకు ప్రత్యేకమైన క్షణమన్న రణదీప్ దంపతులు

బాలీవుడ్ విలక్షణ నటుడు రణదీప్ హుడా ఇంట పండంటి ఆడబిడ్డ అడుగుపెట్టింది. ఆయన భార్య లిన్ లైష్రామ్ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను ఆ దంపతులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, తమ కుటుంబంలోకి వచ్చిన ఈ కొత్త అతిథి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.


అయితే, చిన్నారి రాకతో ఆనందం హుడా కుటుంబానికి రెట్టింపు కావడం విశేషం. ఈ చిన్నారి సరిగ్గా రణదీప్ హుడా తండ్రి రణబీర్ హుడా పుట్టినరోజు నాడే జన్మించింది. తాత, మనవరాలు ఒకే రోజు బర్త్ డే జరుపుకోనుండటంతో ఇది తమకు అత్యంత ప్రత్యేకమైన, భావోద్వేగమైన క్షణమని ఈ జంట పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు రణదీప్ హుడా దంపతులకు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.


Randeep Hooda
Lin Laishram
Randeep Hooda daughter
Bollywood actor
Newborn baby
Ranbir Hooda
Father's birthday
Celebrity news
Bollywood news

More Telugu News